Listen to this article

జనం న్యూస్ 31 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ప్రయాగ్రాజ్‌ మహా కుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 20 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ఒక దురదృష్టకరమైన ఘటన అని, తనను చాలా బాధ కలిగించిందన్నారు. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించాలని కోట్ల మంది వచ్చిన క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోవడం బాధాకరం అన్నారు.