జనంన్యూస్‌అక్టోబర్ 28:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం:
తాళ్ళరాంపూర్ గ్రామంలోని సొసైటీ ఫంక్షన్ హాల్‌లో మంగళారవరంరోజునా ఓపెన్ టు కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్ హాజరై క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగాసీఐ మాట్లాడుతూ యువత మదకద్రవ్యాలు, డ్రగ్స్ వంటి దుష్ప్రవృత్తుల నుండి దూరంగా ఉండాలని, నవ సమాజ నిర్మాణంలో చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు ఐక్యత, క్రమశిక్షణ మరియు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.క్రీడాకారులందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, ఈ టోర్నమెంట్‌నువిజయవంతంగా నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమానికి ఏర్గట్లసబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పడాల రాజేశ్వర్ అధ్యక్షత వహించగా, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ రెడ్డి, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ రాజ్‌కుమార్, రాజేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షుడు సోమ దేవరెడ్డి, నేరెళ్ళ దేవన్న, ఏనుగు నవీన్, ఇట్టేడి రాజ్ కుమార్ తుమ్మలఆనంద్ , గడ్డం జీవన్,అవుల దేవన్న, సల్దే గణేష్,గ్రామ ప్రజలు,అఫీషియల్స్ తదితరులు పాల్గొన్నారు.



