Listen to this article

. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సూపరింటెండింగ్ ఇంజనీర్ రమేశ్…

జనం న్యూస్, అక్టోబర్ 29 (కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ )

లోయర్ మానేరు డ్యామ్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మరియు మిడ్ మానేరు రిజర్వాయర్ నుండి వచ్చే వరద నీరు డ్యామ్‌లోకి చేరడంతో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది.దీంతో, డ్యామ్ భద్రత దృష్ట్యా (బుధవారం) మధ్యాహ్నం 12 గంటలకు స్పిల్వే గేట్లు ఎత్తి సుమారు 4000 క్యూసెక్కుల నీటిని మానేరు నదికి దిగువకు విడుదల చేయనున్నట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. రమేశ్ తెలిపారు.ప్రాజెక్టు దిగువన నది పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు, పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, రైతులు, చేపలు పట్టేవారు మానేరు నదిని దాటే ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అలాగే మానేరు నదిలో వరదలు కొనసాగినంతవరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.