జనం న్యూస్ అక్టోబర్ 29 హైదరాబాద్:
మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌తో కలిసి బుధవారం హరీష్‌రావు నివాసానికి చేరుకుని పరామర్శించారు.ఈ సందర్భంగా సత్యనారాయణరావు చిత్రపటానికి పుష్పగుచ్ఛాలు అర్పించి నివాళులర్పించారు. తండ్రి మృతితో తీవ్ర దుఃఖంలో ఉన్న హరీష్‌రావు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సత్యనారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.


