

జనం న్యూస్. జనవరి 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
తెలంగాణ రాష్ట్రంలోని అమాయక ప్రజలను మభ్యపెట్టి 420 బూటకపు హామీలతో మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికీ 420 రోజులు గడిచిపోయాయని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఈ పాలకులకు బుద్ధిని ప్రసాదించు మహాత్మ అంటూ.బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆదేశానుసారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన దౌల్తాబాద్ బి ఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ అజ్జు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.అధికారమే లక్ష్యంగా, ప్రజలు ఏమైపోతే మాకేంటి అనే రీతిలో అమలుకు సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు.
అభయహస్తం అంటూ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే తెలంగాణ ప్రజల పాలిట బస్మాసుర హస్తంగా కాంగ్రెస్ పాలన తయారైందన్నారు. అన్నం పెట్టే రైతు దేశానికే వెన్ను ముక్క అని నమ్మి
గత పాలకుల పాలనలో దండగగా మారిన వ్యవసాయాన్ని మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతో పండగగా
మార్చిన గొప్ప దార్శనికులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు కెసిఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు భరోసా కు 15 వేలు, రైతు కూలీలకు 12 వేలు ఇస్తామని రైతులను నమ్మించి గొంతు కోసిందన్నారు. రైతు భరోసాను పెంచే విషయం పక్కకు పెడితే ఉన్న 12 వేలకు కూడా అర్హతల పేరిట అడ్డగోలు కొర్రీలను పెడుతూ ఒకసారి సంక్రాంతి, మరోసారి జనవరి 26, ఇంకొకసారి మార్చి 31 అంటూ రైతులను బూటకపు మాటలతో మోసం చేస్తున్నారని అన్నారు. ఇప్పుడేమో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మరో కొత్త నాటకానికి తెర లేపుతున్నారని ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బి ఆర్ ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో. సీనియర్ నాయకులు పటేల్ కిషన్ గౌడ్. పిలుముల యాదయ్య. పిలుముల నవీన్. నందు. సదానందం. ప్రశాంత్. హైమద్. తదితరులు పాల్గొన్నారు.