జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
సాక్షి దినపత్రిక రాజంపేట ఇంచార్జ్, సీనియర్ జర్నలిస్ట్, ఏపీయూ డబ్ల్యూజే నాయకులు మోడపోతుల రామ్మోహన్ తల్లి వెంకటసుబ్బమ్మ (83) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. ఆమె మృతికి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పల్లేటి రామసుబ్బారెడ్డి ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగానే ఏపీయూడబ్ల్యూజే నాయకులు నందలూరులో వారి స్వగృహం వద్ద ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ కార్య క్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కళ్యాణ్, సీనియర్ జర్నలిస్టులు త్రివిక్రమ్, రాయలు, ఆలీ షేర్ తదితరులు పాల్గొన్నారు.


