Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 30

తర్లుపాడు మండల తహసీల్దార్ కె.కె. కిషోర్ కుమార్ బుధవారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.విద్యార్థుల వివరాలు, వసతుల పరిశీలన తహసీల్దార్ కిషోర్ కుమార్ ముందుగా వసతి గృహంలో హాజరుపట్టికను తనిఖీ చేశారు. ప్రస్తుతం వసతి గృహంలో ఉన్న విద్యార్థులు ఎంతమంది, వారి చదువుల వివరాలు, రోజువారీ కార్యక్రమాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.తహసీల్దార్ గదులు, మరుగుదొడ్లు, స్నానాల గదులను పరిశుభ్రతను పరిశీలించారు. బెడ్లు, పరుపులు, తాగునీటి సౌకర్యం వంటి మౌలిక వసతులు సరిగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఏవైనా లోపాలు ఉంటే వాటిని వెంటనే సరిదిద్దాలని సిబ్బందికి ఆదేశించారు.భోజనశాల వంటశాలను సందర్శించి, విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. భోజన నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వసతి గృహం గురించి వారి అభిప్రాయాలు ఏమిటి అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, వసతి గృహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేసారు ఈ కార్యక్రమం లో వి ఆర్ ఓ షేక్ షరీఫ్, వి ఆర్ ఏ చెన్నయ్య, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు