జనం న్యూస్, అక్టోబర్ 30,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
జగదేవపూర్ మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జగదేవపూర్ మండల ఏఎస్ఐ రమణ రెడ్డి అన్నారు, గురువారం మండల కేంద్రంలోని మునిగడప, చాట్లపల్లి , వాహనాల డ్రైవర్లకు , గ్రామ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. మద్యం సేవిస్తున్న యువకులకు మద్యం వలన కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రమాదాల నివారణకు మద్యం సేవించకుండా వాహనాలు నడపడం మంచిదని చెప్పారు.ఒక ప్రమాదంతో రెండు కుటుంబాలు ఆర్థిక నష్టాలతో పాటుగా చిన్న భిన్నం అవుతాయని అన్నారు,డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన రూ. 10 వేల జరిమానా విధించడం లేదా ఆరు నెలలు జైలు శిక్ష అమల్లోకి రావడం జరిగిందనీ చెప్పారు,అలాగే ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం కూడా జరుగుతుందని తెలిపారు. మద్యం సేవించి రెండవసారి వాహనం నడుపుతూ పట్టుపడితే రూ. 15 వేల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. జరిమానా డబ్బులు కట్టని వాళ్లకు, జైలు శిక్ష విధించడంవాళ్లకు జరుగుతుందనీ తెలిపారు,18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని ప్రజలకు సూచించారు,తల్లితండ్రులు మైనర్లకు, చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని ప్రజలకు తెలియజేశారు,పై నిబంధనలు పాటించని వారిపై ఎంపీ చట్టపకారం కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రవి ఉన్నారు.



