జనం న్యూస్ అక్టోబర్ 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి మంత్రివర్యులు వాకిటి శ్రీహరి మరియు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నవీన్ యాదవ్ తో కలిసి శిరీష సత్తుర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ, మోతీ నగర్, షేక్పేట్ తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యావంతులైన నవీన్ యాదవ్ గెలుపుతో ప్రజలకు చాలా ఉపయోగకరమని, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయని కావున ప్రతి ఒక్కరూ నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేయాలని ఆమె కోరారు. ఈ ప్రచారంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, మైనారిటీ నేతలు, యువజన కాంగ్రెస్ సభ్యులు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



