 
									 
జనం న్యూస్ అక్టోబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
మొంథా తుఫాన్ ప్రభావంతో మండల కేంద్రంలోని ఎడతెరిపి లేని భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఏకదాటి కురుస్తూ ఉండడం బలమైన ఈదురు గాలులు వీస్తుండడంతో అతలాకుతలమైంది. ప్రారంభమైన వర్షం భారీ తుఫానుగా కురుస్తూనే ఉంది. భారీ వర్షాలకు మండలంలోని నేరేడుపల్లి గ్రామంలో చేతికి వచ్చిన పంటలు నేలపాలయ్యాయి. పొలాల్లో భారీ ఎత్తున వరద నీరు ప్రవహించడంతో రైతులు మాస్కుల నరసయ్య, పల్లె కోటయ్య, పల్లె సుధాకర్, కడప నాగరాజు, బలవంతుల కుమారస్వామి, గొంది విజేందర్ రెడ్డి వీరి పంట పొలాలు నీట మునగాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది వీరు ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నారు.


