జనం న్యూస్ నవంబర్ 01 సంగారెడ్డి జిల్లా
వేల్పూర్ మండలం వడకపల్లి : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం త్రియంబకపేట్ గండి తండాకు చెందిన బానోత్ సరోజ (46) అనే మహిళను ఆమె భర్త బానోత్ రాజు కర్రతో దాడి చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే—మృతురాలు బానోత్ సరోజ, భర్త బానోత్ రాజు (48) లంబాడ సమాజానికి చెందిన వారు. 2005లో వీరిద్దరికీ వివాహం జరిగింది. దంపతులకు ఒక కూతురు బానోత్ వినోద (18), ఒక కుమారుడు బానోత్ విశాల్ (16) ఉన్నారు.గత ఆరు నెలలుగా బతుకుదెరువు నిమిత్తం వీరు సంగారెడ్డి జిల్లా బీరంగూడకు వచ్చి కూలీ పనులు చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలో వడకపల్లి శివారులో గంగుల రామిరెడ్డి పౌల్ట్రీ ఫారంలో పని చేస్తూ, చెరుకూరి ప్రసాద్ అనే రైతు పొలంలో వ్యవసాయం కూడా చేస్తున్నారు.అయితే అక్టోబర్ 31న రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన భర్త రాజు కర్రతో భార్య సరోజపై దాడి చేయగా, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.గతంలో కూడా భర్త రాజు తన భార్యను వేధించిన కేసులో డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


