Listen to this article

జనం న్యూస్ నవంబర్ 01 సంగారెడ్డి జిల్లా

పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు సంతాపం తెలిపారు.ఇటీవల హరీశ్‌రావు తండ్రి శ్రీ తన్నీరు సత్యనారాయణ స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ శనివారం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసానికి వెళ్లి, సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం హరీశ్‌రావుతో కాసేపు మాట్లాడి, పితృవియోగంలో ఉన్న ఆయనకు ధైర్యం చెప్పారు.