Listen to this article

(జనం న్యూస్ 1 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి )

ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కేవలం రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుంటూ తిరిగే గల్లి లీడర్ల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు, ” ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి చేతులు కలిపే వాళ్లే, తరువాత చుట్టుపక్కల కనిపించరే ” అంటూ గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, పల్లెల్లో విధి దీపాలు వెలుగకపోయినా నీటి సమస్యలు తలెత్తిన – స్థానిక నాయకులు ఎవరు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది గల్లి లీడర్లు మాత్రం ప్రభుత్వ పథకాలను తెచ్చినట్లు చెప్పుకుని తమ ఖాతాలో రాజకీయ మైలేజ్ మాత్రమే వేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ” ప్రజల సేవకులమంటారు కానీ సేవ మాటల్లోనే మిగిలిపోతుంది అసలు అభివృద్ధి కంటే సెల్ఫీలు పోస్టర్లు సోషల్ మీడియాలో హడావుడి ఎక్కువ కనబడుతుంది, మాకు చెప్పితే మంత్రికి చెప్పినట్లే అంటూ కాలయాపన చేస్తున్నారు సమస్య పరిష్కారమయ్యే సమస్య లేదు, ప్రజలు గ్రామ సమస్యలను విన్నవిస్తామంటే మంత్రి ముందు కందిటీగల్లాగా గల్లి లీడర్లేముందుంటారు, ఈ ప్రవర్తన ఇలాగే కొనసాగితే ఎలాంటి నాయకునికైనా చుక్కెదురు ఖాయమని ప్రజలు మండిపడుతున్నారు