జనం న్యూస్, నవంబర్ 1, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి
: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా కో-కన్వీనర్ కట్ట మనోజ్ యాదవ్ అరుణాచలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు.ఈ సందర్భంగా కట్ట మనోజ్ యాదవ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, ప్రజాసేవ పట్ల కట్టుబాటున్న నాయకుడిగా నవీన్ యాదవ్‌ను గుర్తించారని, ఆయనను విశ్వసించి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నవీన్ యాదవ్ విజయం నియోజకవర్గ అభివృద్ధికి కొత్త ఊపును ఇస్తుందని పేర్కొన్నారు.తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై గట్టి విశ్వాసం ఉంచారని, ఆ నమ్మకం ఈ ఎన్నికల్లో ఓట్ల రూపంలో ప్రతిబింబిస్తుందని తెలిపారు. నవీన్ యాదవ్ విజయం ఆ ప్రజా విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుందని కట్ట మనోజ్ యాదవ్ అభిప్రాయపడ్డారు.


