Listen to this article

కాట్రేనికోన జనం న్యూస్ . నంబర్ ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా “మొంథా ఫైటర్” ప్రశంస పత్రం అందుకున్న ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు.నియోజకవర్గం పరిధిలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటినుండి,మొంథా తుఫాను ప్రారంభం నుండే ప్రజలరక్షణ కోసం సమయోచిత చర్యలు తీసుకుని,ప్రజలకు ఒకభరోసా కల్పిస్తూ, సమయస్ఫూర్తిగా వ్యవహరించినందుకు ఈ గౌరవ సత్కారం లభించింది.రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే బుచ్చిబాబు సేవలను అభినందించారు,విపత్తు సమయంలో ప్రజలకు అండగా నిలిచినందుకు ప్రశంసలు తెలిపారు.తుఫాను ముందు నుండే నియోజకవర్గంలోని ప్రతిప్రాంతాన్ని పర్యటించి,పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం,
ఆహారం,త్రాగునీరు,వైద్యసేవలు వంటి అవసరమైన సౌకర్యాలను సమకూర్చడం ద్వారా
దాట్లసుబ్బరాజు ప్రజలకు అందించిన సేవలు ప్రశంసనీయమైనవి.తుఫాను సమయంలో ప్రజలతో మమేకమై రక్షణచర్యలను సమర్థవంతంగా నిర్వహించిన సేవలను ప్రభుత్వంగుర్తించి ఈ సత్కారం అందించింది.ఎమ్మెల్యే కు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు చేతులు మీదగా సత్కారం లభించడంతో కూటమి నాయకులు హర్షం వ్యక