భారతీయ జనతా పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గం, ఐ.పోలవరం మండలం అధ్యక్షులు సాకిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణాపురం లో మైనర్ బాలిక పై జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై బాధితురాలి ఇంటికి రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి మరియు గోదావరి జిల్లాల జోనల్ ఇంచార్జి సాలగ్రామ లక్ష్మీప్రసన్న శనివారం వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, ఇవి జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం తగిన శ్రద్ధ తీసుకోవాలని ఆమె అన్నారు. అలాగే ఈ గ్రామస్తులు మీ బాధితులకు అండగా ఉన్నందుకు వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మా పార్టీ కార్యకర్తలు ఈ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం అన్నారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ, ముమ్మిడివరం మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గోలకోటి వెంకటరెడ్డి, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మూర్తిరాజు, జిల్లా కోశాధికారి గ్రంధి నానాజి, ఆకుమర్తి బేబీ రాణి, మహిళా మోర్చా స్టేట్ సెక్రటరీ, మాజీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నందం శ్రీలక్ష్మి, స్పెషల్ ఇన్వైటింగ్ యనమదల రాజ్యలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి, జిల్లా సెక్రెటరీ మోకా ఆదిలక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు వై.శకుంతల మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



