జనం న్యూస్, నవంబర్ 1, జగిత్యాల జిల్లా,
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ విభాగానికి ప్రత్యేకంగా గుర్తింపు లభించింది. గత నెలలో వృత్తిరీత్యా అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు, ఎస్ ఐ చిరంజీవికి, WASI రాజశ్రీ పి సి, మరియు రాజ్ కిరణ్ లకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ వారు ప్రశంస పత్రం అందజేశారు.ఈ కార్యక్రమ ద్వారా పోలీసులు ప్రజలకు ఎలా సేవలను అందిస్తున్నారు మరియు వారు సమాజానికి ఏ విధంగా సాయపడతారో తెలియజించేందుకు ఉపయోగపడుతుంది అని ఈ సందర్భంగా ఎస్పీ గారు చెప్పారు, ఎస్పీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మీ ప్రతిభ మరియు కృషిని గుర్తించి ఈ ప్రశంసా పత్రాన్ని అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు, ఇలాంటి గుర్తింపుతో ప్రతి పోలీస్ స్టేషన్లో అధికారులు అందరూ డ్యూటీలలో సక్రమంగా నిర్వహించి ఇలాంటి పురస్కారాలు మరెన్నో పొందాలని అన్నారు,


