జనంన్యూస్. 02.నిజామాబాదు. రురల్.
ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. రైతు పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని కనీస మద్దతు ధరలు సైతం రైతులు పొందలేకపోతున్నారన్నారు.2-11-25 న ధర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ అకాల వర్షాలకు తడిసిన ధాన్యం మక్కలు తదితర పంటలను వెంటనే కొనుగోలు చేయాలని రైతులకు సరిపడా టార్పాలిన్లు అందజేయాలని కళ్ళల్లలోకి చేరిన ధాన్యానికి రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే, కొనుగోలు కేంద్రాలదే అని అన్నారు. తూకం వేసి ధాన్యాన్ని బయిల్డ్ రైస్ మిల్లులకు తరలించి కొన్న ధాన్యానికి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అన్నారు. దీనితో పాటు 500 బోనస్‌ను కూడా అందించాలని అన్నారు. జిల్లాలో రైతుల సమస్యలపై రాబోయే రోజుల్లో బలమైన రైతు ఉద్యమాన్ని నిర్మిస్తామని భూమయ్య తెలిపారు. మంచిప్పా 21 ప్యాకేజ్ పనులు ప్రారంభించి గడ్కోలు సెగ్మెంట్ లోని 84 వేల ఎకరాలకు సాగు తాగునీరు అందించాలని అన్నారు. సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ ని బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడిపించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే రబి సీజన్ కు గాను రైతాంగానికి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారానే నాణ్యమైన విత్తనాలు అందించాలని అన్నారు. దేశంలో ఇప్పటికైనా 90% ప్రైవేట్ విత్తనాల కంపెనీలదే పెత్తనం కొనసాగుతుందని నకిలీ విత్తనాలతో రైతులను నిండా ముంచుతున్నాయి అన్నారు. బహుళ జాతి విత్తన కంపెనీలను అరికట్టాలని రైతును వ్యవసాయాన్ని రక్షించుకోవాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు బకాయి పడ్డ 450 కోట్ల రూపాయలు విడుదల చేసి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థను ఆదుకోవాలని దాని అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ వెలుగులో రాబోయే రోజుల్లో రైతాంగ సమస్యలపై బలమైన రైతు ఉద్యమాన్ని నిర్మిస్తామని భూమయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి మార్క్స్, జిల్లా నాయకులు నిమ్మల భూమేష్, లక్ష్మణ్, దేవదాస్, ఫారుక్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.


