జనం న్యూస్ 03 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
గంట్యాడ మండలం కొత్తవెలగాడ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడవాడ దాలినాయుడు( డెబ్బై) మృతి చెందాడు. మృతుడు తన స్వగౌమం కొత్తవెలగాడ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు బస్సు ఎక్కేందుకు ప్రయత్నించే సమయంలో బస్సు ముందు చక్రం కింద పడ్డాడు. తల నుజ్జె అక్కడికక్కడే మృతి చెందాడు.
గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు.


