Listen to this article

జనం న్యూస్ 03 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

పి డి యస్ యూ పి వై యల్ యూ యస్ యాప్ ఐ నాయకుల ధర్మవరం బీసీ బాలురు హాస్టల్ సందర్శన
జిల్లా అధికారులు హాస్టల్లో వైపు కన్నెత్తి చూడకుండా , విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని చూడకుండా ఫోటోలకే పరిమితమైన జిల్లా విద్యాశాఖ అధికారులు, హాస్టల్లో సంక్షేమ అధికారులు విద్యార్థులు నిరంతరం సమస్యలతో పోరాడుతూనే ఉన్నారు దాదాపుగా అక్కడ మిషన్ భగీరథ వాటర్ పైప్లైన్ లీకేజీ విద్యార్థులకు కలుషిత నీరు తాగడం చేత మరియు విద్యార్థులకు ఉడికి ఉడకని భోజనం పెట్టడం చేత విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న అధికారులు ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత హడావుడిగా చర్యలు తీసుకోవడం తప్ప జిల్లా స్థాయి అధికారులు హాస్టల్లో సందర్శించడంలో విఫలమయ్యారని విద్యార్థుల్లో హాస్టల్లో సమస్యలు పరిష్కరించమని ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన అధికారులు నిమ్మక నిరత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు అర్ ఓ ప్లాంట్ చెడిపోయి దాదాపు ఆరు నెలలు కావస్తున్న అక్కడున్నటువంటి వార్డెన్ కానీ అధికారులు కానీ రిపేర్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు మిషన్ భగీరథ లీకేజ్ కావడం చేత ఈరోజు అధికారులు హడావుడి పైప్ లైన్ ను వేయడం జరుగుతుంది విద్యార్థుల ప్రాణాలంటే జిల్లా విద్యాశాఖ అధికారులకు ఏ ఒక్కరికి ఏ ఒక్క అధికారికి విద్యార్థుల పట్ల ప్రేమ లేకపోవడమే ఇలాంటి సంఘటనలను జరుగుతా ఉన్నాయి హాస్టల్లో బోరు నీళ్లు ఉన్న ఉప్పునీరుగా ఉన్న పరిస్థితి వంట చేసుకోవడానికి రాని పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వర్కర్ల సహాయంతో విద్యార్థులను ఆసుపత్రికి చేర్పించడం జరిగింది నిరంతరం ఇలాంటి సంఘటనలు జరగకుండా విద్యాశాఖ అధికారులు సంక్షేమ శాఖ అధికారులు నిరంతరం హాస్టల్ లపై నిగా ఉంచాలని కోరారు కార్యక్రమములో పి డి యస్ యూ జిల్లా అధ్యక్షులు హాలింపాష పి వై యల్ జిల్లా అధ్యక్షులు బిరేల్లి దానయ్య, యూ యస్ యాప్ ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రంగస్వామి