జనం న్యూస్ నవంబర్ 03
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా కమిటీ (500/82) ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ వృత్తిదారుల సమస్యలపై ఈరోజు కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా దర్బార్ కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించేందుకు సంఘ ప్రతినిధులు హాజరయ్యారు. అయితే అనివార్య కారణాల వలన ప్రజా దర్బార్ కార్యక్రమం రద్దు కావడంతో, వినతిపత్రాలను కౌంటర్లలో సమర్పించి, రసీదులు తీసుకున్నారు.
తరువాత సంఘ ప్రతినిధులు జిల్లా వెనకబడిన తరగతుల అధికారి శ్రీమతి విజయలక్ష్మి ని కలుసుకొని తమ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఈ.డి. విజయలక్ష్మి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కడియాల సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు దడిగల మల్లేష్, అరసవిల్లి వెంకటేశ్వరరావు, ఉబ్బా నపల్లి కాశయ్య, కడియాల శ్రీనివాస్ రావు, మాడుగుల ముక్తేశ్ రావు, జనగామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.సంఘం తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ముఖ్యమైన అంశాలు:నాయి షాపులకు పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లులు వెంటనే చెల్లించాలి.ప్రస్తుతం అమల్లో ఉన్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కొనసాగించాలి.నాయి బ్రాహ్మణ వృత్తిదారుల అభివృద్ధి కోసం ప్రత్యేక నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి.అలాగే “రాజువ యువశక్తి” పథకం కింద దరఖాస్తు చేసుకున్నవారు స్టీల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళవచ్చని ఈ.డి. విజయలక్ష్మి గారు తెలిపారు. ట్రైనింగ్ కోసం పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు 20–30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. ఆసక్తి ఉన్న వారు ఫోన్ నెంబర్: 9441688476 కు సంప్రదించవచ్చని సూచించారు.
నాయి బ్రాహ్మణ వృత్తిదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంఘ నాయకులు కోరారు.



