జనం న్యూస్ నవంబర్ 03 సంగారెడ్డి జిల్లాలో
ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి 32 దరఖాస్తుదారులు తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రతి అర్జీ పై తక్షణ చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అలాగే ప్రజల ప్రధాన సమస్యలపై పూర్తి దృష్టి ,పెట్టి పరిష్కార ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి , డి.ఆర్.ఓ పద్మజ రాణి నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


