నిధులు లేవు అంటున్న అధికారులు ప్రజల్లో ఆగ్రహం అదృతం
(జనం న్యూస్ 3 నవంబర్ ప్రతినిధి కాజీపేట రవి)
ప్రతి సోమవారం నిర్వహించి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అనేక సమస్యలపై అర్జీలు పెట్టుకున్న పరిష్కారం కాని పరిస్థితి నెలకొంది తాగునీటి కొరత రహదారి మరమ్మత్తులు పెన్షన్ జాబితా సవరణలు గృహ పథకాలు వంటి పాలు సమస్యలపై ప్రజలు పదే పదే విజ్ఞప్తులు చేసిన అధికారులు నిరక్షంగా వ్యవహరిస్తున్నారని అర్జిదారులు ఆరోపిస్తున్నారు, ప్రతిసారి తగిన చర్యలు తీసుకుంటామని మాటిస్తూనే తర్వాత నిధులు లేవు మంజూరు కోసం ఎదురు చూస్తున్నాం అంటూమాట దాటేస్తున్నారని, అర్జీ పడితే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని అన్నారు మూడు నెలలుగా తాగునీటి బోరు చెడిపోయింది వారం వారం ప్రజావాణి కి వెళ్లిన సమాధానం ఒక్కటే నిధులు లేవు ఇది ప్రజలకు న్యాయమా అని ప్రశ్నించారు అధికారుల వివరణ ప్రజావాణిలో వచ్చిన అన్ని అర్జలను నమోదు చేసి పై అధికారులకు పంపిస్తున్నాం కానీ నిధుల మంజూరు ఆలస్యం అవుతుంది తక్షిణ పరిష్కారం సాధ్యమయ్యే అంశాలను త్వరలోనే పరిష్కరిస్తాం అని అధికారులు తెలిపారు


