Listen to this article

జనం న్యూస్ నవంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం

సి సి ఐ కేంద్రాలలో కొనుగోళ్లలో పరిమితి లేకుండా రైతు ఎంత పత్తి పండిస్తే అంత పంటకు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి మాట్లాడుతూ… సీసీఐ కొనుగోలు కేంద్రాలలో పత్తి కొనుగోలు ఒక రైతుకు ఎకరాకు 12 క్వింటాళ్లు నుండి 7 క్వింటాలకు కుదించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఒక ఎకరానికి 10 క్వింటాళ్లు పత్తి పండిస్తే 7 క్వింటాళ్లు కొనుగోలు చేస్తే మిగతా 3 క్వింటాళ్ల కోసం దళారులను ఆశ్రయించడం వల్ల రైతు ఆర్థికంగా నష్టపోతాడని తెలిపారు. అధిక వర్షాలతో రైతులు ఇబ్బందులలో ఉన్నారని, రైతును ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి తీసుకురావద్దని సూచించారు. అలాగే 12 శాతం తేమ కాకుండా వర్షాభావ పరిస్థితుల వల్ల 20 శాతం తేమ ఉన్న మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై కపట ప్రేమ చూపిస్తూ రాష్ట్రంలో పంట నష్టం పై ప్రశ్నిస్తున్న బీజేపీ తమ పరిధిలోని ఆంక్షలను ఎత్తివేసి చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారపెల్లి రవీందర్, చిందం రవి, మారపెల్లి వరదరాజు, రంగు బాబు, అంకేశ్వరపు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు….