Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 4

జన విజ్ఞాన వేదిక తర్లుపాడు మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మండల స్థాయి చెకుముకి సైన్స్ పరీక్ష మండలంలోని అన్ని హైస్కూలు విద్యార్థులకు నిర్వహించడం జరిగింది. ప్రథమ స్థానం పొందిన చెన్నారెడ్డిపల్లి విద్యార్థులు డిసెంబర్ నెలలో జిల్లా స్థాయిలో నిర్వహించే జిల్లా సైన్సు పరీక్షకు ఎంపికయ్యారని అధ్యక్షులు విప్లవకుమార్, కార్యదర్శి పి. కోటి మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక తర్లుపాడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముతోజు సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ పట్ల ఎలాంటి అభిరుచి కలిగి ఉండాలి మరియు శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్నటువంటి మార్పుల గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం నిర్వహించిన మండల స్థాయి క్విజ్ పోటీలలో కూడా చెన్నారెడ్డి హైస్కూల్ విద్యార్థులు కె సాయికుమార్ రెడ్డి, చెరుకుల దివ్య శ్రీ, గడ్డం గాయత్రి ప్రథమ స్థానం పొందారు. ద్వితీయ స్థానము తర్లుపాడు హైస్కూల్ విద్యార్థులు,తృతీయ స్థానం తాడివారిపల్లె హైస్కూల్ విద్యార్థులు సాధించారు గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ తో పాటు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. కార్యక్రమంలో పలు హైస్కూల్ ఉపాధ్యాయులు ప్రదీప్ కుమార్, నాగేంద్ర, శ్రీనివాసులు, సంజీవ్ కుమార్ రమణ, వెంకటేశ్వర్ రెడ్డి శ్రీనివాసులు, హుస్సేనయ్య అచ్యుతరావు, తదితరులు పాల్గొన్నారు.