Listen to this article

జనంన్యూస్. 04. నిజామాబాదు. ప్రతినిధి.

బీడీకార్మికులను చట్టం ఉల్లంగించి ఆర్థిక దోపిడీ చేస్తున్న దేశాయ్ బ్రదర్స్ కంపెనీ పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ సలహాదారులు (కేభినెట్ హోదా మంత్రి) పి.సుదర్శన్ రెడ్డికి ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు వినతి పత్రం ధ్వారా విజ్ఞప్తి. బీడీకార్మికులను చట్టం ఉల్లంగించి ఆర్థిక దోపిడీ చేస్తున్న దేశాయ్ బ్రదర్స్ కంపెనీ పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారులు (కేభినెట్ హోదా మంత్రి) పి.సుదర్శన్ రెడ్డికి రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు అందజేసిన వినతి పత్రం ధ్వారా విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు భీడీపెడరేషన్ సీనియర్ అధ్యక్షులు ఏఎస్. పోశెట్టి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందన్, మాజీ జెడ్పి చైర్మన్ విఠల్ రావు, సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి. ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారులు (కేభినెట్ హోదా మంత్రి) పి.సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్ లో ఆయనను కలసి వినతి పత్రం అందజేసి సమస్యను తీవ్రతను, కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. ఈ సందర్బంగా భీడీపెడరేషన్ సీనియర్ అధ్యక్షులు ఏఎస్. పోశెట్టి
, మాజీ జెడ్పి చైర్మన్ విఠల్ రావులు మాట్లాడుతు: దేశాయ్ యాజమాన్యం కార్మికుల పొట్ట కొట్టి, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ వేతన ఒప్పందాలకు ఎగ నామం పెట్టి కార్మికులకు ఇవ్వాల్సిన కూలీల్లో నుండి పది రూపాయలు తక్కువ చేసి ఇవ్వడం ఇటు కార్మికులను అటు ప్రభుత్వాన్ని మోసం చేయడమేనన్నారు. రోజుకు వేయి బీడీలకు పది రూపాయల చొప్పున 70వేలమంది వద్ద కోట్లాది డబ్బుల్ని దోచుకున్నారన్నారు. కార్మికుల్ని మోసం చేస్తూ డబ్బులు దండుకొని మోసం చేస్తున్నారన్నారు. మరొక వైపు వేయి భీడీలకు సరిపోయే అంత ముడిసరుకులు (ఆకు, తంబాకు, దారం) ఇవ్వడం లేదు అని అదికూడా నాసిరకం ది ఇవ్వడం వల్ల మరింత నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది అన్నారు. తమ దోపిడీ చాలదు అన్నట్టుగా పితారా పేరుతో ఉన్న నాసిరకం జీరో తినుబండారలను, ప్రభుత్వ అనుమతి లేనివి కార్మికులకు అంటగడుతున్నారాన్నారు (విక్రయస్తూన్నరన్నారు). దీని వల్ల కార్మికులు ఇష్టం లేకున్న కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నారు. దేశయ్ బ్రదర్స్ కంపెనీ చేస్తున్న ఆర్థిక దోపిడీ విషయంలో చట్టరీత్య చర్యలు తీసుకొని 10సంవత్సరాలనుండి దోచుకున్న కోట్లాది డబ్బులను కార్మికులకు తిరిగి చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలి అని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సలహాదారులు (కేభినెట్ హోదా మంత్రి) పి.సుదర్శన్ రెడ్డిని కల్సిన బృందంలో సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్, రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, తెలంగాణ ప్రగతిశీల భీడీవర్క్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు ఎం. ముత్తేన్న, ప్రధానకార్యదర్శి ఆర్. రమేష్, ఉపాధ్యక్షురాలు వి. సత్తేమ్మ తదితరులు ఉన్నారు.