జనం న్యూస్ నవంబర్04 సంగారెడ్డి జిల్లా:
తక్కువ ఖర్చుతో యాత్రికులు పుణ్యక్షేత్రాలు దర్శించుకునేందుకు ఆర్టీసీ కల్పించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి తెలిపారు. ఇవాళ రామచంద్ర పురంలోని ఆయన స్వగృహంలో ఆర్టీసీ హెచ్ సీయూ డిపో మేనేజర్ శ్రీనాథ్ గౌడ్, ఎండీ ఇసాక్, పటాన్ చెరు మేనేజర్ ఎండీ అక్బర్ తో పాటు పలువురు ఆర్టీసీ ఎమ్మెల్సీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రయాణికులకు అందించే టూర్స్ గురించి వివరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రైవేట్ వాహనాలతో పోలిస్తే తక్కువ ఛార్జీతో సురక్షితంగా భక్తులు పుణ్యక్షేత్రాలను సందర్శించేలా ఆర్టీసీ చర్యలు తీసుకోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. టూర్స్ ప్యాకేజీ ల మీద పెద్ద ఎత్తున్న ప్రచారం చేయాలన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ‘పుణ్యక్షేత్రాల దర్శనం’ పేరిట ప్యాకేజీని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మొదలుపెట్టిందన్నారు. ప్రైవేట్ బస్సులు, టూర్ ఆపరేటర్లతో పోల్చితే ఆర్టీసీ పుణ్యక్షేత్రాల దర్శనం ప్యాకేజీ ధరలు తక్కువగా ఉంటుందన్నారు. ఆయన వెంట ఆయన సతీమణి సంగారెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి తదితరులు ఉన్నారు.


