జనం న్యూస్ 05నవంబర్ పెగడపల్లి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల సాధన కొరకు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా బీసీ నాయకులు మండల తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం బీసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్లను పార్లమెంటులో గవర్నర్ ఆమోదం తెలిపి బీసీలకు వెంటనే 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నీరటి రాజ్ కుమార్ ఉప్పు రవి ముల్క రాజేశం తౌటు గంగాధర్ గంగుల కొమురెల్లి పెద్ది బీరయ్య చెట్ల రాజు కూన కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర రాములు గౌడ్ ఒరు గల శ్రీనివాస్ కడారి తిరుపతి విజయ భాస్కర్ భాస్కర్ తడగొండ రాజు సంధి మల్లారెడ్డి సుర కంటి సత్తిరెడ్డి కుంచె రాజేందర్ పుల్కం జగపతి అడుప మారుతి బాదినేణి మల్లయ్య టిఆర్ఎస్ నాయకులు కట్ల తిరుపతి రాచకొండ ఆనందం తదితరులు పాల్గొన్నారు


