జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.నవంబర్ 4, అన్నమయ్య జిల్లా
రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలోని టంగుటూరు గ్రామంలో వెలసి ఉన్న పురాతన చెన్నకేశవ స్వామిఆలయం అన్నమయ్య బందిఖానా,శివాలయం సిద్దేశ్వర స్వామి ఆలయాలు ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నాయని వీటిని వారసత్వ ప్రదేశాలుగా గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పునరుద్ధరించా లని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు, భక్తికి కవిత్వానికి మూల స్తంభమైన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుపతికి వెళ్లే ముందు టంగుటూరులో చెన్నకేశవ స్వామి ని ఆరాధించినట్లు స్వామి పై కీర్తనలు కూడా రచించినట్లు చరిత్ర చెబుతుంది, సాలువ నరసింహరాయలు కాలంలో అన్నమయ్యను తనపై కీర్తనలు రాయలేదని కోపంతో ఆయనను అక్కడే బంధించారని చారిత్రాత్మక వృత్తాంతం,ఈ పవిత్ర చరిత్రను నిలబెట్టే చిహ్నాలు ప్రస్తుతం శిథిలావస్థలో కనుమరుగు అంచున ఉన్నాయి ఈసమస్యకు స్పందించిన,టిడిపి సోషల్ మీడియా టీం నాయకుడు చలమాల మురళీకృష్ణ చలమాల కేశవులు , కుటుంబం ఈ ఆలయాల సంరక్షణకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తన కుటుంబం తరఫున 2 లక్షలు విరాళం ప్రకటించారు ప్రజలు ఈ పవిత్ర స్థలాల పునరుద్ధరణతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు,



