జనం న్యూస్ 05 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
మెయిన్ రోడ్ దుస్థితి మరోసారి బయటపడింది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో స్క్రాప్ లోడ్తో రామభద్రపురం వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ వ్యాన్ రహదారి మధ్యలో ఉన్న లోతైన గుంతలో ఇరుక్కుపోవడంతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సుమారుగాగత 4 సంవత్సరాలుగా ఈ ప్రధాన రహదారి మరమ్మత్తులు లేక గుంతలతో నిండిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న ఈ రహదారిని తక్షణం ఫోరైనా అభివృద్ధి చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


