సత్యనారాయణ స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
జనం న్యూస్- నవంబర్ 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లో బుధవారం కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పండుగను వైభవంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక భక్తులు శివాలయాలలో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించారు. పవిత్ర కృష్ణా నదిలో కార్తీకదీపాలు వదిలారు. కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భముగా హిల్ కాలనీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు రాధాకృష్ణమాచార్యులు, రామాంజనేయచార్యులు,వెంకటాచార్యులు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. సుమారు 300 మంది పైగా పుణ్య దంపతులు ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్థానిక ఎస్ ఐ ముత్తయ్య దంపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరైనారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మంచి కంటి కిషోర్, నిర్వహణ కార్యదర్శి కృష్ణ, సీతారాములు తదితరులు పాల్గొన్నారు. హిల్ కాలనీలోని కాత్యాయని సమేత ఏలేశ్వర మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి ఆలయ పూజారి పవన్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్వాలాతోరణం కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరైనారు.


