జనం న్యూస్, నవంబర్ 5, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
సిద్దిపేట రూరల్, నవంబర్ 5: సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండల మాదిగ జాగృతి సంఘం (ఎం జె ఎస్ ) మండల అధ్యక్షుడిగా బుస్సాపూర్ గ్రామానికి చెందిన మద్దూరి నరేష్ మహారాజ్ నియమితులయ్యారు.
ఈ నియామక పత్రాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు రాజన్ మహారాజ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ మహారాజ్ నరేష్ మహారాజ్ కు అందజేశారు.ఈ సందర్భంగా మద్దూరి నరేష్ మహారాజ్ మాట్లాడుతూ, “నాపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన జిల్లా కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు. భవిష్యత్తులో మాదిగ జాగృతి సంఘం తరఫున ఎలాంటి కార్యక్రమాలైనా శ్రద్ధతో నిర్వహించి విజయవంతం చేయడానికి కృషి చేస్తాను. మండలంలోని అన్ని గ్రామాల మాదిగ సోదరులను ఏకం చేయడానికి నిరంతరం కృషి చేస్తాను,” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాస్కర్ మహారాజ్, నాయకులు పాల్గొన్నారు.


