Listen to this article

జిల్లాస్థాయి క్రీడా పోటీలకు ఏర్పాట్లు పూర్తి- ప్రిన్సిపాల్ రవికుమార్

జనం న్యూస్- నవంబర్ 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-

నాగార్జునసాగర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే బిసి గురుకుల విద్యాలయసంస్థ ఆధ్వర్యంలో బీసీ గురుకుల పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రీడా పోటీలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అండర్ 14 అండర్ 17, అండర్19 విభాగాలలో జిల్లాస్థాయిలో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. అండర్ 17 విభాగంకు చెందిన క్రీడా పోటీలు 6 వతేదీ నుంచి 8వ తేదీ వరకు, అండర్ 14 విభాగానికి చెందిన క్రీడా పోటీలు 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీలలో జిల్లాలోని 16 పాఠశాలలు, కళాశాల కు చెందిన 1000మంది విద్యార్థులు వివిధ క్రీడా పోటీలలో పాల్గొంటారని తెలిపారు. గురువారం నిర్వహించే క్రీడపోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి సైదులు, జాయింట్ సెక్రెటరీ శ్యాంప్రసాద్, పూర్వ విద్యార్థులు శ్రవణ్ కుమార్, శివాజీ తదితరులు పాల్గొంటారని ప్రిన్సిపల్ రవికుమార్ తెలిపారు.