జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 5
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని, ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలంలోని శైవ క్షేత్రాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
తర్లుపాడు గ్రామం: శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయం తర్లుపాడు మండల కేంద్రమైన తర్లుపాడు గ్రామంలో వెలసిన శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.ఆలయ అర్చకులు ఆర్.ఎస్. శర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నేరెళ్ల కుమార్ సమక్షంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు స్వామి ఘరలకంటుడు సుదీర్ఘ దర్శనం కల్పించారు. కేతగుడిపి గ్రామం: శ్రీ గంగ భవాని సమేత కేదారేశ్వర స్వామి ఆలయం అదేవిధంగా, తర్లుపాడు మండలంలోని కేతగుడిపి గ్రామంలో కొలువైన శ్రీ గంగ భవాని సమేత కేదారేశ్వర స్వామి ఆలయంలో కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు రాఘవ శర్మ మరియు రాము శర్మ దంపతులచే స్వామి వారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించబడ్డాయి.విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.మహిళా భక్తులు అధిక సంఖ్యలో కార్తీక దీపాలు వెలిగించి, స్వామి వారిని దర్శించుకుని, తమ భక్తిని చాటుకున్నారు.



