Listen to this article

జనం న్యూస్ నవంబర్ ఐదు ముమ్మిడివరం ప్రతినిధి

బొల్లి మునియ్య మెమోరియల్ ఉన్నత పాఠశాల ప్లస్ రాజానగరం మండలంవేదుళ్లపల్లి నందు ప్రాలిఫిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సత్య బొల్లి గారు 6 లక్షల వ్యయం తో నిర్మించిన బోజనశాల ప్రారంభోత్సవం గ్రామ సర్పంచ్ పెందుర్తి బుజ్జియ్య చౌదరి మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మెన్ శ్రీమతి పడాల వరలక్ష్మీ చేతులమీదుగా జరిగినది. గతంలో పాఠశాల దత్తత తీసుకున్న సత్య బొల్లి నిర్మించిన సైన్స్ ల్యాబ్ మరియు స్టాఫ్ రూమ్ ప్రారంభోత్సవ సమయం లో కూటమి నేతలు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి,స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ,తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి వారి చేతులమీదుగా శంకుస్థాపన జరిగినది.నాడు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు కార్తీక పౌర్ణిమ పర్వదినం రోజున విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగినది. నేటి కార్యక్రమంలో సర్పంచ్ బొజ్జియ్యచౌదరి, చైర్మన్ వరలక్ష్మీ, హెడ్మాస్టర్ ఎన్ వి వి సత్యనారాయణ,కూటమి నాయకులు తన్నీరు సురేష్, విశ్వనాధం,నీరుకొండ శ్రీను,గిద్దాడ త్రిమూర్తులు,ఉపాధ్యాయులు,విద్యార్ధులు పాల్గొన్నారు. విద్యార్ధులు,ఉపాధ్యాయులు సత్య బొల్లి కి,నీరుకొండ వీరన్న చౌదరి కి ధన్యవాదములు తెలియచేశారు.