Listen to this article

వీరన్నపేట మాజీ ఎంపీటీసీ ఎలికట్టే శివ శంకర్ గౌడ్

జనం న్యూస్, నవంబర్ 5, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )

చేర్యాల మండలం వీరన్నపేట గ్రామానికి చెందిన ఎలికట్టే శివ శంకర్ గౌడ్,ప్రజా సమస్యలను తనదైన శైలిలో తీర్చుతూ అందరి మన్నలను పొందుతున్నాడు..వీరన్నపేట గ్రామంలో ఏ పేదింటి ఆడ బిడ్డ పెళ్లి అయిన తన వంతుగా పుస్తే మట్టెలు అందిస్తారు, ఈ విధంగా ఎంతో మంది పేద ఆడబిడ్డలకు దేవుడు ఇచ్చిన సోదరుడిగా ఉంటూ పెళ్ళికి అండగా నిలుస్తున్నాడు..అదే విధంగా వీరన్నపేట గ్రామంలో ఎవరు చనిపోయిన ఇంటికి వెళ్లి పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాడు శివశంకర్..భవిష్యత్తులో కూడా కుటుంబానికి అండగా ఉంటూ చనిపోయిన కుటుంబానికి ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాడు..వీరన్నపేట పాఠశాల లో కూడా విద్యార్థుల కు ప్యాడ్ లు, పెన్నులు అందించడమే కాకుండా, పాఠశాల కి తన స్వంత నిధులు సుమారుగా 60,000 రూపాయలతో ప్రవేశ ద్వారాన్ని నిర్మించాడు ఈ శివ శంకర్..ఈ విధంగా భవిష్యత్తు తరాల భవిష్యత్తు కొరకు ఆలోచనతో పని చేస్తున్నాడు..గ్రామం అంతా స్వచ్ఛమైన నీరు తాగాలి అని సదుద్దేశంతో సుమారు 1,70,000 రూపాయలు ఖర్చు పెట్టీ గ్రామంలో ఉన్న ప్రతీ కుటుంబానికి 20 లీటర్ల వాటర్ క్యాను ను అందించాడు..ఈ సందర్భంగా శివ శంకర్ మాట్లాడుతూ భవిష్యత్తులో గ్రామ ప్రజల అందరి ఆశీస్సులతో గ్రామానికి మరిన్ని సేవలు చేస్తానని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన శాయశక్తుల ప్రయత్నం చేస్తానని తెలిపారు..