జనం న్యూస్ నవంబర్ 5 నడిగూడెం
గ్రామ పంచాయతీ కార్మికులపై దాడి అప్రాజస్వామికని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు.మంగళవారం గ్రామ పంచాయతీ ఆవరణలో పెంపుడు కుక్క మరణించిన విషయం తెలుసుకొని పెంపుడు కుక్కయజమాని, బంధువులు కార్మికులపై దాడి చేసిన విషయం తెలుసుసుకొని బుధవారం నడిగూడెం మండల కేంద్రానికి జిల్లా సిఐటియు బృందంతో విచ్చేసి దాడి పూర్వ పరాలను కార్మికుల ద్వారా తెలుసుకొని దాడికి గురైన కార్మికులు చిమట నాగరాజు,సుభాని,దున్న భూమేష్,వెంకటమ్మ,ఉపేంద్ర లను పరామర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు.దాడి చేసిన వారిని శిక్షించాలని, భవిష్యత్తులో పంచాయతీ కార్మికులపై దాడులు పునరావృత్తం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్సై ని కోరారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ కార్మికుల పక్షాన సిఐటియు నిరంతరం పనిచేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.కార్మికులపై ఎవరు దాడి చేసినా సహించేది లేదని హెచ్చరించారు.గ్రామ పంచాయతీ కార్మికులకు న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సోమపంగు రాధాకృష్ణ, సిఐటియు మండల కన్వీనర్ మల్లెల వెంకన్న,మధుసూదన్, అన్వర్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.


