జనం న్యూస్ 06 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపుదల కోసం, విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ సిఐ సి హెచ్.సూరి నాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో నవంబర్ 5న మైనర్ డ్రైవర్లు మరియు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ సి.హెచ్.సూరినాయుడు మాటలాడుతూ – మైనర్లు వాహనాలు నడపడం చట్టపరంగా నేరమని, ప్రమాదాలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు. తల్లిదండ్రులు వారి పిల్లలపై పర్యవేక్షణ వహించాలని, రోడ్డు నియమాలను ఉల్లంఘించే మైనర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఎస్ఐ ఎస్. భాస్కర్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


