జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ నవంబర్ 6
వ్యవసాయ, సహకార మరియు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు, తెలంగాణ ప్రభుత్వం , ఏ పి సి కార్యదర్శి గారు, సి సి ఐ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సి సి ఐ, మరియు జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మధ్య జరిగిన చర్చల ఫలితంగా తేదీ 6, నవంబర్, 2025 నుండి ప్రారంభమవ్వాల్సిన జిన్నింగ్ మిల్స్ సమ్మెను వాయిదా పడింది అందువల్ల నేటి నుండి జగిత్యాల జిల్లాలో సి సి ఐ వారి పత్తి కొనుగోలు కేంద్రo గా నోటిఫై చేసిన శాతవాహన జిన్నింగ్ మిల్లు లలో పత్తి కొనుగోలు కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయి. రైతు సోదరులు తమ పత్తిని సమీప మార్కెట్ యార్డులకు యధావిధిగా తీసుకురావాలని మద్దతు రేటు తో అమ్ముకోవాలని జిల్లా జగిత్యాల మార్కెటింగ్ అధికారి తెలిపారు


