జనం న్యూస్ నవంబర్ 06:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము :
ఎస్.జి.ఎఫ్. ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–17 బాలికల జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ముప్కాల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో అద్భుత క్రీడా ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారిణులను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టులోకి ఎంపిక చేశారు. కామారెడ్డిలో జరిగిన ఈ పోటీల్లో చక్కని ఆటతీరు కనబరిచిన ఏర్గట్ల ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థిని రెండ్ల రవీనా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యింది.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి, పి.డి జ్యోతి, ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్, రాజశేఖర్, సమిత, ఎస్.శ్రీనివాస్, విజయ్‌కుమార్, రాజేందర్, రాజనర్సయ్య, తాడూరి గంగాధర్, ప్రవీణ్‌శర్మ, కే.శ్రీనివాస్, ట్వింకిల్కుమార్, నరేష్, కే.గంగామోహన్, కోమలి, రిషిక, కృష్ణవేణి, అలాగే సి.ఆర్.పిలు గంగాప్రసాద్, మహేందర్ తదితరులు విద్యార్థిని రవీనా విజయాన్ని అభినందించారు.



