(జనం న్యూస్ 6 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి )
భీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో అంగన్వాడి కేంద్రంపై ఎంపీడీవో మధుసూదన్ విస్తృత తనిఖీ నిర్వహించారు పౌష్టికాహార పంపిణీ వంటగది పరిశుభ్రతను పరిశీలించారు, పిల్లలకు అందజేస్తున్న ఆహార నాణ్యత పై సిబ్బందిని ప్రశ్నించారు, ఈ సందర్భంగా ఎంపిడిఓ మధుసూదన్ మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్యం, పోషకాహారం కోసం, ఎక్కడ నిర్లక్ష్యం ఉండకూడదు అని హెచ్చరించారు, గర్భిణి స్త్రీలు, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రికార్డులను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు అంగన్వాడి టీచర్ దుర్గం సునీత, ఆయా నీలాల రాజ్యలక్ష్మి, హెల్పర్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సేవలలో లోపాలు తలెత్తకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు




