Listen to this article

సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయ్యాలి

మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు

ఎస్సై మల్లేష్

జనం న్యూస్ నవంబర్ 06

సూర్యాపేట ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు కోదాడ సబ్ డివిజన్ డీఎస్సీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని జయ పాఠశాలలో విద్యార్థులకు షీ టీమ్స్,మహిళల భద్రత, బాలికా చైతన్యం,సైబర్ నేరాలపైన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సై మల్లేష్ మాట్లాడుతూ.. మహిళలపై వేధింపులు జరిగితే షీ టీం వాట్సాప్ నంబర్ 8712686056 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. టీ సేఫ్ యాప్ పై విద్యార్థినిలు అవగాహన కలిగియుండాలని అన్నారు.వ్యక్తిగత సమాచారం,బ్యాంకు వివరాలు,ఏటీఎం పిన్ నెంబర్లు,సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డిపి లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వేణు, షి టీమ్ హెడ్ కానిస్టేబుల్ కవిత, కానిస్టేబుల్ లు సాయి జ్యోతి, నాగేంద్ర బాబు, విద్యార్థినీ విద్యార్థులు మరియు ఉపాధ్యాయని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.