Listen to this article

జనం న్యూస్ నవంబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని ప్రగతి సింగారం గ్రామంలో పోచమ్మ తల్లీ దేవాలయ ఆవరణలో పశువులకు స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ యం.సునిల్ ప్రజ్వాల్ సంస్థ సంయుక్తంగా గ్రామంలోని 125 తెల్లజాతి పశువులకు మరియు నల్లజాతి 115 జీవాలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయటం జరిగింది అనంతరం ప్రజ్వాల్ సంస్థ ప్రతినిధి షేక్. గౌస్ మాట్లాడుతూ మూగజీవాలు వాటి బాధలను చెప్పలేవని ముందుగానే రైతులు నివారణకు టీకాలు వేసుకొని మూగజీవాలను రక్షించు కోవాలని రైతులు ఆర్థికంగా నష్టపోకుండా జాగర్త పడాలని వివరించడం జరిగింది రాజస్థాన్. గుజరాత్ పశ్చిమ బెంగాల్ లొ కేరళ తమిళనాడు లలో పశు సంపద పూర్తిగ లేకుండా నష్టపోవడం జరిగిందని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది సి ఎచ్ రమేష్ బాబు వి ఎల్ ఓ పి రవి జెవిఓ ఎన్ సదానందం వి ఎ గ్రామ రైతులు పెద్దిరెడ్డి. తిరుపతిరెడ్డి దాసరి రాజిరెడ్డి దాసరి. లక్ష్మరెడ్డి చిలుకల. కొమురయ్య పైడీ పెద్దిరెడ్డి. హేమంత్ రెడ్డి తాళ్ల. తిరుపతి నవయుగ సొసైటీ డైరెక్టర్ కర్ర ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు….