Listen to this article

జుక్కల్ నవంబర్ 7 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం రోజు తాసిల్దార్ ఎండి ముజీబ్ మాట్లాడుతూ వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 7 వందేమాతరంను రచించిన గౌరవనీయులు శ్రీ బంకించంద్ర ఛటర్జీ గేయంలో పొందుపరచబడిన గొప్ప విషయాలు గురించి తెలుసుకోవడం జరిగింది అలాగే ప్రతి వ్యక్తి దేశభక్తి కలిగి ఉండాలని అలాంటి వాళ్ళకే సమాజంలో గౌరవం ఉంటుందని స్వేచ్ఛ స్వాతంత్రం వైపుగా నడిపించుటకు గాను భారత జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో వందేమాతరం గేయం చాలా ప్రాచుర్యం పొందిందని దీనిని బెంగాల్ రచయిత స్వాతంత్ర సమరయోధుడు బంకిం చంద్ర చటర్జీ రాసినారని ప్రతి ఒక్కరూ నైతిక విలువలతో ఉన్నప్పుడే సంఘంలో గౌరవం ఉంటుందని తాసిల్దార్ తెలుపడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో తాసిల్దార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు