జనం న్యూస్ సూళ్లూరుపేట తిరుపతి జిల్లా
సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇటీవల వచ్చిన మోంతా తుఫాను ప్రభావంతో జీవనోపాధి దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన సహాయక కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా 1742 మత్స్యకారుల కుటుంబాలకు మరియు సూళ్లూరుపేట మండలం మన్నారపోలూరు గ్రామంలోని 54 నేయదారుల కుటుంబాలకు ఈ రోజు 6 రకాల నిత్యావసర సరుకులతో పాటు ప్రతి కుటుంబానికి 50 కిలోల బియ్యం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో మత్స్యకారులు సముద్రపు వేటకు వెళ్ళలేక పోవడం, మరియు నేయదారులకు జరీ–నెయ్యడం లాంటి పనులు తాత్కాలికంగా నిలిచి పోవడం వలన జీవనోపాధి కోల్పోయారని అలాంటి వారిని ఆదుకునేందుకు ఈ సహాయ కార్యక్రమం చేపట్టామని 1742 మత్స్యకారుల కుటుంబాలు + 54 నేయదారుల కుటుంబాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలు మరియు పునరావాస కార్యక్రమాలు సూళ్లూరుపేట నియోజకవర్గంలో సమర్థవంతంగా అమలవుతున్నాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఆకుతోట రమేష్ ఏజి కిషోర్, పచ్చవ మాధవ నాయుడు, బాబు నాయుడు, మురళి మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు



