Listen to this article

జనం న్యూస్ నవంబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని ఆరేపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న వంటి ఇందిరమ్మ ఇండ్ల పనులు సి ఈ ఓ జెడ్పి ఇన్చార్జ్. రవి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులలో నాణ్యత పై ఏమాత్రం రాజీపడకుండా ప్రతి దశలో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అవసరమైన వస్తువులు లబ్ధిదారులకు సకాలంలో అందజేయాలని ఆదేశించారు ఇందిరమ్మ ఇండ్లను ప్రతి ఒక్క లబ్ధిదారుడు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎం పి డి వో ఫణి చంద్ర హౌసింగ్ ఏ ఈ తేజ శాయంపేట కార్యదర్శి రత్నాకర్ ఆరేపల్లి గ్రామ కార్యదర్శి సల్తానా గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు….