జనం న్యూస్ 08 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
గరివిడి మండలం చిన ఐతంవలస వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో చీపురుపల్లి మండలం పెరుమాళికి చెందిన కొరగంజి శ్రీలత (48) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
భర్త సంగం నాయుడుతో కలిసి స్కూటీపై చీపురుపల్లి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది.ఈ దుర్చటనలో బస్సు ముందు చక్రం శ్రీలత తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా నాయుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు.


