స్వామి శరణు ఘోషతో మార్మోగిన మడుతూరు
జనం న్యూస్, నవంబర్ 10,అచ్యుతాపురం:
స్వామియే శరణమయ్యప్ప.. హరి హరి వాసనే..శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో పేటతుల్లి కార్యక్రమం మడుతూరు అయ్యప్ప స్వాముల పీఠకం ఆధ్వర్యంలో
మార్మోగింది.పూజలు,అభిషేకాలు వైభవంగా జరిగాయి. గ్రామంలో పురవీధులగుండా మణికంఠుడిని పల్లకిపై ఊరేగింపు నిర్వహించారు.వివిధ రకాల వేషాధారణలు అయ్యప్ప అయ్యప్ప స్వాములు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గురుస్వామి తోట వెంకటేష్, మోటూరు త్రినాధ్ స్వామి, పూర్ణ స్వామి తదితర అయ్యప్ప స్వామిలు పాల్గొన్నారు.


