Listen to this article

జనం న్యూస్ నవంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన, :

కాట్రేనికోన మండల పరిధిలో కుండలే శ్వరంలో పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ ప్రత్యేక పూజలు నిర్వహిం చారు, ఆలయ మర్యాదలతో దేవస్థానం ఈఓ సూర్య వెంకట దుర్గా అధర్వంలో ప్రధాన అర్చకులు కామేశ్వర రావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు, ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామి వారిని దర్శించి కునేందుకు నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు, అనంతరం ఆలయ సన్నిధిలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో తీర్థ ప్రసాదాలను స్వీకరించారు, ఈ కార్యక్రమలలో మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వర రావు, కాట్రేనికోన మండల టీడీపీ అధ్యక్షులు చెల్లి సురేష్, నాయకులు గుత్తుల సాయి,వెంట్రు సుధీర్,త్సవటపల్లి నాగు, నడింపల్లి సుబ్బరాజు, విత్తనాల వెంకట రమణ,వాసంశెట్టి రాజేశ్వర రావు, పిఎస్ యన్ రాజు, గంగుమళ్ల రవి కుమార్, వనచర్ల నాగేశ్వర రావు, రంబాల రమేష్ బండారు ఏసు, విత్తనాల జయ భార్గవ్, రవి వర్మ, కాండ్రేగుల సత్య ప్రసాద్, కముజు లక్ష్మీ రమణా రావు, గంగుమళ్ల భద్రరావు, మోటుపల్లి శ్రీనివాస్, కూటమి నాయకులు,కార్యకర్తలు తదితరులున్నారు.