జనం న్యూస్ నవంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, :
కాట్రేనికోన మండల పరిధిలో చేయ్యేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలిం గేశ్వర స్వామి వారికి కార్తీక మాసం పరమ శివుని ఆరుద్ర నక్షత్రం సందర్భంగా విశేషంగా పూజా కార్యక్రమాలను వైఎస్ఆర్ సీపీ నేత, నడింపల్లి సూర్యనారాయణ రాజు (సూరిబాబు) సుభద్ర సూరిబాబు దంపతులచే ఆకొ Oడి మహేష్ శర్మ ఆధ్వర్యంలో 15 మంది ఋత్విక్కులతో ముందుగా విఘ్నేశ్వర పూజ, మహాన్యాసం,18 రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకాలు, మహా లింగార్చన.. శతసహస్ర బిల్వ దళాలతో పత్రి పూజా ఉమాదేవి అమ్మవారికి కుంకుమార్చన, జ్యోతిర్లింగార్చన చతుర్వేద స్వస్తి, నీరాజన, మంత్ర పుష్పాలు, ఆశీర్వచనాలు, పండిత సత్కారలను నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ కమిటీ అదర్వంలో ఆలయానికి పచ్చని తోరణాలతో విద్యుత్ కాంతులతో అలంకరణ చేశారు, ఈ పూజ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



